KTR: తెలుగు సినిమాల్లో తెలంగాణా యాస ... కేటిఆర్ ఆసక్తికర ట్వీట్

Telangana accent in telugu cinemas

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ యాసలో తీస్తున్న సినిమాలపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర ట్విట్ చేశారు. అప్పుడు తెలంగాణ యాసను హేళన చేసిన చోట ఇప్పుడు తెలంగాణ యాసకు కీర్తి దక్కుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

కేటీఆర్ ట్విట్ కు కారణం ఇదే


డాక్టర్ దండే శ్రీరాములు అనే వ్యక్తి కేటీఆర్ కు వాట్సప్ ద్వారా సందేశం పంపారు ఈ క్రింది విధంగా

డియర్ సార్ మీతో నేను రెండు విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను.. అందులో ఒకటి ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది తెలంగాణ యాసలో ఇప్పుడు సినిమాలు రావడం అవి అద్భుతంగా ప్రజాదరణ పొందడం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఎగ్జాంపుల్ బలగం దసరా లాంటి సినిమాలు ఈ క్రెడిట్ అంతా కేసీఆర్ కే దక్కుతుంది.


ఇక రెండో విషయం ఏమిటంటే నాకు 68 ఏండ్లు ఇలాంటి సినిమాలు వస్తాయని కలలో కూడా ఊహించలేదు తెలుగు సినిమాల్లో తెలంగాణ వారిని విలన్లుగా జోకర్స్ గా చూపించడంతో గత 20 ఏళ్ల నుంచి సినిమా ధియేటర్లకు వెళ్లడం మానేశాను అని అన్నారు.


ఈ వాట్సాప్ సందేశం పై కేటీఆర్ స్పందిస్తూ సర్ మీ అభిప్రాయాన్ని నేను ఫిట్ చేయొచ్చా అని అడిగారు అది కూడా మీ అనుమతితో అని కేటీఆర్ అడగ్గా శ్రీరాములు కూడా పాజిటివ్గా స్పందించారు. తప్పకుండా మీరు ట్విట్ చేస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు మమ్మల్ని అడగడం మీ మంచితనానికి నిదర్శనం థాంక్యు వెరీ మచ్ సార్ అంటూ శ్రీరాములు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది