Tspsc: పరిక్షల కంట్రోలర్ గా నియామకం అయిన ఐఏఎస్ అధికారి BM సంతోష్

 


తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్ లీక్ల విషయం సంచలనంగా మారిన విషయం అందరికి తెలిసిందే. దిని వలన తెలంగాణా ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.


తాజాగా తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పది కొత్త పోస్టులను మంజూరు చేసింది. పరిక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్, జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్, జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులు, జూనియర్ సివిల్ జడ్జి కేడెర్లో లా ఆఫీసర్ పోస్టులకు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపింది. వీటికి ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. అలాగే కొత్త పోస్టులను మంజూరు చేసింది.


ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వహిస్తున్న B M సంతోష్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. TSPSC అదనపు కార్యదర్శిగా ఐఎఎస్ అధికారి బి ఎం సంతోష్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. దీంతో సంతోష్ TSPSC పరిక్షల కంట్రోలర్ గా వ్యవహరిస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది