Dalai Lama: బాలుడితో దలై లామా అసభ్య ప్రవర్తన

 

Dalai Lama

Dalai Lama: నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ శాంతి సందేశాలు చేసే బౌద్ధ మత గురువు దలైలామా వివాదాల్లో చిక్కుకున్నారు. ఎంతోమంది భక్తులు ఆయనని కలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు వస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఓ భారతీయ కుర్రాడు దలైలామా ఆశీర్వాదం కోసం ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ బాలుడిని దగ్గరకు తీసుకొని ముద్దు పెడతాడు అంతేకాకుండా నీ నాలుగతో నా నాలుకను తాగుతావా అంటూ ఆ బాలుడు పై ఒత్తిడి తేవడంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన తీరిపై భక్తులు నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం ఆధ్యాత్మిక బోధనలు చేసే దలైలామా ఇలా కూడా వ్యవహరిస్తారా అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన వీడియో వైరల్ కావడంతో ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ కూడా వినబడుతున్నాయి. అయితే దలైలామా ఈ ఘటనకు చింతిస్తూ వెంటనే క్షమాపణలు చెప్పాడు. తాను కలుసుకునే వ్యక్తులను బహిరంగ కెమెరాల ముందు కూడా టీజ్ చేస్తానని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దలైలామా చేసిన ఈ పనికి పూర్తిగా షాక్ అయ్యాను గతంలో కూడా తను సెక్సియస్ట్ అనే వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కానీ ఓ చిన్న కుర్రాడితో ఇప్పుడు నా నాలుకను తాగుతావా అని చెప్పడం అసహ్యంగా ఉంది. అని ఓ నిటిజన్ ట్విట్ చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో



కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది