Mythri Movie Makers: మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటి సోదాలు

 

Mythri Movie Makers

Mythri Movie Makers: ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ స్ ఆఫీస్ లో సుమారు 6 గంటలుగా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ తనిఖీలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ కి విదేశాల నుంచి వచ్చిన నిధులపై ఢిల్లీ బృందం ఆరా తీస్తున్నది. ఆర్బిఐ అనుమతి లేకుండా 500 కోట్ల వరకు అమెరికా నుంచి పెట్టుబడులు పెట్టినట్లు వీడి గుర్తించింది. ఈరోజు జూబ్లీహిల్స్ లోని మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం తో పాటు నిర్మాణ సంస్థ అధినేతలు ఎలమంచిలి రవిశంకర్ నవీన్ ఎర్నేని ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నరు. మైత్రి మూవీస్ నిర్మాణంలో పుష్ప- 2 సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.


సుకుమార్ ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఒకే సమయంలో నాలుగు చోట్ల రెండు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఆఫీస్ గేటుకు తాళాలు వేసి లోపల నుంచి బయటకు బయట నుంచి లోపలికి ఎవరిని ఐటి అధికారులు అనుమతించడం లేదు గత డిసెంబర్లో మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే ఐడీకి అందించిన లెక్కలు కాగితాలు వ్యత్యావసాలు ఉన్నట్లు గుర్తించారు.


తనిఖీల తర్వాత జనవరిలో మైత్రి మూవీస్ విడుదల చేసిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సినిమా బడ్జెట్ లాభాలు చెల్లించిన ఇన్కమ్ టాక్స్ లెక్కల్లోనూ భారీగా వ్యత్యాసం ఉందని సమాచారం ఐటి అధికారులు తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాల నేపథ్యంలో పుష్ప-2 షూటింగ్ రద్దు చేసినట్లు సమాచారం 700 కోట్లకు సంబంధించిన జిఎస్టి సరిగా కట్టలేదని ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది