Netflix: భారీగా తగ్గించిన యూసర్ చార్జీలు

 

Netflix

Netflix: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటీపీ సంస్థలలో రారాజుగా ఓ వెలుగు వెలుగుతున్న ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్  గత మూడు సంవత్సరాలుగా నెట్ ఫ్లిక్స్ కి దక్కుతున్న ఆదరణ పెరుగుతున్న సబ్స్క్రైబర్లు ఏ ఓటీటి ప్లాట్ఫామ్ కు లేదు ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లో ఇష్టపడే వారికి నెట్ ఫ్లిక్స్ ఒక్కటే ఆప్షన్ అయితే ఈమధ్య ఇండియాలోనూ నెట్ ఫ్లిక్స్ సంస్థ సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రీజనల్ సినిమాలను వరుసగా కొనుగోలు చేస్తుంది. అంతేకాకుండా మన అందరికీ అందుబాటులో ఉండే విధంగా సబ్స్క్రిప్షన్ చార్జీలలో మార్పులు కూడా తీసుకొచ్చింది.


నెట్ ఫ్లిక్స్ సంస్థ తాజాగా వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ ప్రకటించింది ఇండియాతో సహా 115 దేశాల్లో సబ్స్క్రిప్షన్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది సబ్క్రిప్షన్ ధర నెలకు 199 రూపాయలు ఉండే మొబైల్ ప్లాన్ ను 149కి తగ్గించింది అదేవిధంగా టీవీలు కంప్యూటర్లతో పాటు ఎక్కడైనా యాక్సెస్ చేసుకోగలిగే ప్లాన్ చార్జిని 499 నుండి 199కి తగ్గించింది ఇక నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కావాలనుకునే వారికి ఇవి సరసమైన ధరలు అనే చెప్పాలి.


నెట్ ప్లిస్ సంస్థ లాభాలను పెంచుకునేందుకు గతంలో ఎన్నో వ్యూహాలను తీసుకొచ్చింది కానీ అవేవీ పెద్దగా యూస్ కాలేదు దాంతో తాజాగా మరో పద్ధతిని అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ త్వరలోనే పెయిడ్ పాస్వర్డ్ షేరింగ్ ఫీచర్ ని తీసుకురావడానికి సిద్ధమైంది దీనివలన తమ యూజర్లు అకౌంట్ పాస్వర్డ్ లను ఇతర వ్యక్తులతో పంచుకుంటే ఎక్స్ట్రాగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది మొదట అమెరికాలో అందుబాటులోకి రానుంది. కొన్ని నివేదికల ప్రకారం 10 కోట్ల మంది నెట్ ఫ్లిక్స్ వ్యక్తిగత వినియోగదారులు ఇతర ఇతరుల ఖాతాలను వినియోగిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది