Virupaksha; విడుదలకు సిద్దమవుతున్న సాయి ధరం తేజ విరూపాక్ష

 

Virupaksha

Virupaksha: టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్న ఈ చిత్రం టైటిల్ గేమ్స్ వీడియో టీజర్ ఇప్పటికే నెట్లో హల్చల్ చేస్తున్నాయి.

SDT15వ ప్రాజెక్టుగా వస్తున్న సాయి ధరం తేజ్ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రం మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు విరూపాక్ష ట్రైలర్ను రేపు ఉదయం 11 గంటల ఏడు నిమిషములకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. థ్రిల్లింగ్ మిస్టరీ వరల్డ్ లోకి నడిచేందుకు రెడీగా ఉండండి అంటూ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. మేకర్స్ తాజా లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది ఈ చిత్రంలో మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్ ఫిమేల్ రోల్ పోషిస్తుంది. ఈ చిత్రానికి కాంతారా ఫేమ్ ఆజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర - సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు విరూపాక్షలో బ్రహ్మాజీ అజయ్ సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సాయి ధరంతేజ్ విరూపాక్షతోపాటు సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతం తెలుగు రీమిక్స్ లో కూడా నటిస్తున్నాడు. అందులో పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ద లీడర్ లో నటిస్తున్నాడు ఆ మూవీ ప్రస్తుతం షూటింగ్ చేసుకుంటుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది