Project Tiger: ప్రాజెక్టు టైగర్ కి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ఆదివారం కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వులో సఫారీ వెళ్లారు. ఇందులో భాగంగా పులుల డేటాను విడుదల చేశారు. మొన్న శనివారం హైదరాబాదులో పర్యటించిన మోడీ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. తరువాత చెన్నై వెళ్లారు అక్కడినుండి ఆదివారం కర్ణాటకలోని బందిపోటు టైగర్ రిజర్వులో పర్యటించి పులుల డేటాని విడుదల చేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ పెద్ద పులుల సంరక్షణకు భారత్ ఎంతో కృషి చేసిందని అన్నారు ప్రపంచంలోనే భారత్ ఈ విషయంలో ఆదర్శప్రాయంగా నిలిచిందని తెలిపారు.
భారతదేశంలో క్రమంగా తగ్గుతున్న పులుల సంఖ్యను కాపాడే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఒకటి ఏప్రిల్ 1973 సంవత్సరంలో ప్రాజెక్టు టైగర్ని ప్రారంభించింది. 1973లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు టైగర్ నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్టు టైగర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పులుల సంరక్షణ మరియు తగ్గిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు ఈ ప్రాజెక్టు టైగర్ ని 1973లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు టైగర్ 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 టైగర్ రిజర్వులను కలిగి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో 3000 పులులు ఉన్నట్లు డేటా చెబుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా పులుల జనాభాలో 70 శాతం మన భారతదేశంలోనే ఉన్నాయి గత 50 సంవత్సరాల నుండి పులుల సంఖ్య వృద్ధి చెందుతుంది ప్రతి ఏడాది దేశంలో 6 శాతం పులుల సంఖ్య పెరుగుతుంది.
ప్రాజెక్టు టైగర్ను 1973లో ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నుండి ఇందిరా గాంధీ ప్రారంభించింది. 20వ శతాబ్దం ప్రారంభంలో భారత దేశంలో పులుల జనాభా 20 వేల నుండి 40,000 వరకు ఉండేది మహారాజులు మరియు బ్రిటిష్ వారు వేటడం కారణంగా 70లో వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. అంతేకాకుండా ఆహార కొరత కారణంగా మరికొంత నష్టం జరిగింది అందుకోసమే ఈ టైగర్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు.
