Custody: మరో కొద్ది రోజుల్లో అక్కినేని నాగచైతన్య కస్టడీ సినిమా విడుదల కాబోతోంది నాగచైతన్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో చిత్రీకరించిన సినిమా ఇది ఈ సినిమాలో చైతు కానిస్టేబుల్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్లు టీజర్ సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ చేశాయి. మానాడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకట్ ప్రభు ఈ కస్టడీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు దీంతో అంచనాలు తారస్థాయికి చేరాయి ద్విభాష చిత్రంగా రూపొందించిన కస్టడీ మే 12న విడుదల అవుతుంది. ఈ సమయంలో చిత్ర మేకర్స్ ఇప్పటి నుంచే అప్డేట్లను ప్రకటిస్తూ అంత హైట్ క్రియేట్ చేస్తున్నారు కాగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల చేశారు.
ఇళయరాజా యువన్ శంకర్ రాజా సంయుక్తంగా స్వరపరిచిన ఈ పాటను అరుణ్ కౌడిన్య తో కలిసి యువజన శంకర్ రాజా పాడారు రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించాడు. హెడ్ అప్ హై అంటూ పోలీసుల గొప్పతనాన్ని తెలిపే ఈ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తాయని పలువురు నిటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఈ పాట ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు. నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది అరవిందస్వామి ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు నటి ప్రియమణి ఒక కీలక పాత్ర పోషిస్తుంది. హక్కుల రూపంలో భారీ స్థాయిలోనే ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం అంతేకాకుండా నాగచైతన్య మార్కెట్ కు రెండు రెట్లు అధికంగా బిజినెస్ జరుగుతుందని చిత్ర బృందం తెలుపుతున్నారు.
