![]() |
Virupaksha Movie Review: కార్తీక్ దండు దర్శకత్వం వహించి సాయి ధరమ్ తేజ్ మరియు సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. థ్రిల్లర్ జోనర్ సినిమాలంటే ప్రేక్షకులకి కిక్ ఎక్కువ ఇంతకుముందు వచ్చిన సినిమాలు అరుంధతి, మసూద్ లాంటివి ఈకోవకే చెందినవే ఇలాంటి అనుభూతిని ఇచ్చే సినిమాలను ప్రేక్షకులు తేలికగా మర్చిపోలేరు చాలా రోజుల తర్వాత అలాంటి అనుభూతిని ఇచ్చే టీజర్ మరియు ట్రైలర్ ద్వారా చూపించిన చిత్రం విరూపాక్ష ఈరోజు విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తమ అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూ ద్వారా చూద్దాం.
కథ:
రుద్రవణo అనే ఒక ఊరిలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 1979 నుండి 1991 వరకు జరిగే కథాంశంతో రూపొందింది. ఇక సినిమాలోకి వెళితే 1979లో రుద్రవణo ఊరిలో ఒక జంట చేతబడులు చేస్తుంది అని భావించిన ఊరి ప్రజలు ఆ జంటని సజీవ దహనం చేసి చంపుతారు. ఆ జంట మంటల్లో కాలిపోతున్న సమయంలో వచ్చే పుష్కరం లోపు ఈ గ్రామ ప్రజలందరూ చనిపోతారు. ఇదే మా శాపం అని శపించి చనిపోతారు. సినిమా 1979 నుండి 1991వ సంవత్సరంలోకి వెళ్తుంది గ్రామస్తులు ఎలాంటి దుష్టశక్తులు రాకుండా గ్రామ మొత్తాన్ని మంత్ర శక్తులతో అష్టదిగ్బంధనం చేస్తారు. అయినా కూడా ఏదో ఒక విధంగా వరుసగా హత్యలు జరుగుతూనే ఉంటాయి అసలు ఈ రుద్రవరం ఊరికి ఏమైంది ఈ హత్యలు చేస్తుంది ఎవరు? అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవడానికి సూర్య (సాయి ధరం తేజ్) ఊరిలోకి దిగుతాడు సూర్య రుద్రవణo ఊరికి వచ్చాక సినిమాలో ఎవరు ఊహించని ట్విస్టులు ఎదురవుతాయి. హీరోయిన్ సంయుక్త మీనన్ కి ప్రాణగండం ఉంటుంది. వీటన్నిటిని సూర్య ఎలా ఎదుర్కొన్నాడు చివరికి ఏమైంది అనేది థియేటర్లో చూసి అనుభూతి చెందాల్సిందే.
విశ్లేషణ:
20వ దశాబ్దంలో మనల్ని థియేటర్లో భయపెట్టిన చిత్రాలని చూస్తే చంద్రముఖి, అరుంధతి, కాంచన, ఈమధ్య వచ్చిన మసూద లాంటి చిత్రాలు హర్రర్ మిస్టరీ అనుభూతి ఇచ్చే సినిమాగా విడుదలైన విరూపాక్ష చిత్రం ప్రేక్షకులను వణుకు పుట్టించే సినిమా అని కచ్చితంగా చెప్పగలం మౌత్ టాక్ తో ఆడియన్స్ లో ఇంకా బలంగా వెళ్తే మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. అనడంలో ఎలాంటి సందేహం లేదు అంతా అద్భుతంగా త్రిలింగు గురయ్యే విధంగా డైరెక్టర్ కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆయనకు ఇది మొదటి సినిమా అంటే ఎవరు నమ్మరు
ఇక ఈ చిత్రంలోని నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే హీరో సాయిధరమ్ తేజ తన నటనలో పరిణితిని మెరుగుపరుచుకున్నాడు హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా అద్భుతంగా నటించింది ఈ సినిమాలో ట్విస్టులు అద్భుతంగా ఉన్నాయి ఫస్టాఫ్లో వచ్చే లవ్ స్టోరీ కొంచెం కథను స్లోగా నడిపించిన సెకండాఫ్ లో కథని ముందుకు తీసుకెళ్లిన విధానం అద్భుతంగా ఉంది ముఖ్యంగా సినిమా చివరి 30 నిమిషాలు అయితే ప్రేక్షకులని కుర్చీలోంచి లేవ్వనివ్వదు. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అంజనీష్ లోకనాథ్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు ఓవరాల్ గా అన్ని విభాగాల్లో బాగుంది ఈమధ్య వచ్చిన హర్రర్ జోనర్ సినిమాల్లో విరూపాక్ష చిత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు.
చివరిగా హారర్ సినిమాలంటే భయం ఉన్నవాళ్లు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు రాత్రిపూట ఒంటరిగా మాత్రం ఈ చిత్రాన్ని చూడకండి
రేటింగ్ 3/5
