Nani: దసరా మూవీ రివ్యూ

 

Dasara Movie Review

శ్రీకాంత్ ఓదెల డెబ్యు డైరెక్టర్గా నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా స్టార్ స్టూడియోస్ నిర్మించిన చిత్రం దసరా ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందించారు.

ఉగాది నుండి నాని దసరా సినీ ప్రమోషన్ లో చాలా బిజీగా గడిపారు. ఇటు టాలీవుడ్ తో పాటు నార్త్ ఇండియాలో కూడా ప్రమోషన్స్ నిర్వహించారు. దీనితో దసరా చిత్రంపై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఒక రేంజ్ లో అంచనాలు పెరిగాయి. నాని మొదటిసారిగా ఊరమాస్ లూక్తో మన ముందుకు వచ్చాడు. కెరీర్లో భారీ బడ్జెట్ తో తిసిన ఈ సినిమా కానీ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నాని అనేక ఇంటర్వ్యూలో చెప్పడం మనం చూసాం ముఖ్యంగా టీజర్ ట్రైలరు మరియు పాటలన్నీ బాగా క్లిక్ అవడంతో నాని మాటలు అభిమానులు నమ్మారు. అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ హీరో రేంజ్ లో జరిగిపోయాయి ఇలాంటి భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషలలో విడుదలైంది మరి ఈ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉందో లేదో చూద్దాం.

కథ;

ధరణి (నాని) సూరి (దీక్షిత్ శెట్టి) వెన్నెల (కీర్తి సురేష్) ఈ ముగ్గురు కలిసి ఒకే ఊరిలో ఉంటారు. ధరణి, సూరి వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళ ఇద్దరి జీవితాల్లోకి వెన్నెల వస్తుంది వెన్నెలని ఇద్దరూ ప్రేమిస్తారు కానీ వెన్నెల మాత్రం సూరి ప్రేమిస్తుంది వాళ్ళిద్దరూ ప్రేమించు కుంటున్నారని తెలిసి ధరణి తన ప్రేమ త్యాగానికి సిద్ధమవుతాడు కానీ ఇంతలో సూరిని విలన్ చంపేస్తారు ఇది తెలుసుకున్న ధరణి తన మిత్రుడిని చంపిన వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు అన్నదే స్టోరీ.

ప్లస్:

టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో మంచి మాస్ డైరెక్టర్ దొరికిండని చెప్పుకోవచ్చు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తీర్చిదిద్దున తీరు అందరూ మెచ్చుకుంటారు. కొన్ని సన్నివేశాల మనకు తెలియకుండానే చప్పట్లు కొట్టేస్తాం ఒక డైరెక్టర్ తన మొదటి సినిమాను సినిమాలోనే ఇంత పరిణితి చూపడం మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక హీరో నాని నటన గురించి ప్రత్యేకించి మనం చెప్పేది ఏముంటది నాని మామూలు సన్నివేశాలనే తన అద్భుతమైన నటనతో వేరే లెవెల్ కి తీసుకెళ్తాడు అలాంటిది అద్భుతమైన సన్నివేశాలు ఉంటే నాని యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు దసరా కూడా అలానే జరిగింది. ఫస్టాఫ్ లో వచ్చే ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అలాగే డిఓపి కూడా చాలా అద్భుతంగా తీశారు ఫ్రెండ్ గా ఆక్ట్ చేసిన దీక్షిత్ శెట్టి కూడా అద్భుతంగా నటచాడు శెట్టి తెలుగులో మొట్టమొదటి చిత్రం ఇక ఈ చిత్రం హీరోయిన్ కీర్తి శక్తి గురించి మాట్లాడుకుంటే నేషనల్ అవార్డు విన్నర్ మహానటి తర్వాత అలాంటి పాత్ర ఏది పడలేదు ఈ సినిమాలో ఆమె ఓ రేంజ్ లో నటించింది ఇక సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్న పాటలు స్క్రీన్ మీద కూడా అదిరిపోయాయి థియేటర్లో ఆడియోస్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

మైనస్:

ఈ చిత్రంలో మైనస్ గురించి ఎక్కువగా చెప్పకుండా ఫస్ట్ ఆఫ్ లో ఉన్న ఇంట్రెస్ట్ మనకు సెకండ్ హాఫ్ లో ఉండదు. సెకండ్ హాఫ్ కొంచెం లాగిైనట్టు ఫస్టాఫ్ ఇచ్చినంత ఎలివేషన్ అంతగా నచ్చకపోవచ్చు

చాలా రోజుల తర్వాత ఆ టాలీవుడ్ లో ఒక ఊర మాస్  సినిమా మాస్ ఫైట్స్ తో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉన్న చిత్రం వచ్చింది. అదే దసరా నాని కెరీర్ లో ఒక మంచి సినిమాగా నిలిచే సినిమా అని చెప్పొచ్చు.

రేటింగ్ 3/5

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది