Rashmika: బెల్లంకొండతో డేటింగ్ చేస్తున్న రష్మిక ?

Rashmika Dating With Bellamkonda Srinivas

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన హీరోయిన్ ఎవరంటే రష్మిక అనే అందరు అంటారు. రష్మిక సినీ జీవితంలో మొదటి నుండి వివాదాలే. రష్మిక తన మొదటి సినిమా కిరాక్ పార్టీ ఆ చిత్ర హీరో రక్షిత శెట్టిని ప్రేమించింది. దీంతో ఈ విషయం పెళ్లి వరకు వెళ్లింది నిశ్చితార్థం కూడా జరిగింది. నిశ్చితార్థం జరిగాక రష్మిక మనసు మార్చుకుంది వెంటనే రక్షిత కి గుడ్ బాయ్ చెప్పేసింది.


దీంతో కన్నడ నటుడైన రక్షిత శెట్టి తన అభిమానులు రష్మికపై విరుచుకుపడ్డారు. విపరీతంగా ట్రోల్స్ చేశారు దీనితో కన్నడ పరిశ్రమలో రష్మిక ఇమేజ్ మొత్తం పోయింది. ఇక ఏం చేయాలో అని ఆలోచిస్తున్న సమయంలో టాలీవుడ్ నుంచేలి ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చాయి. చలో, గీతాగోవిందం, సరిలేరు నీకెవ్వరు, చిత్రాలు స్టార్ హీరోయిన్ ని చేశాయి, విజయ దేవరకొండ తో రెండు సినిమాలు చేసిన రష్మిక ఇద్దరు దగ్గరయ్యారని చాలా పుకార్లు వినబడ్డాయి.


విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరూ మాల్దీవ్స్ కి వెకేషన్ కూడా వెళ్లారు. అక్కడే ఒకే రూమ్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. దీంతో ఫ్రెండ్ తో టూర్ కి వెళ్తే తప్పేంటి అని భుకాయించింది. టైగర్ మూవీ షూటింగ్ సమయంలో కూడా దేవరకొండ ఎక్కువగా ముంబైలోనే ఉన్నారు ఆ సమయంలో ఇద్దరు చాలాసార్లు నైట్ డిన్నర్ పార్టీలకు వెళ్తూ కెమెరా కంటికి చిక్కారు.


ఇప్పుడు పాన్ ఇండియా ఫిలిం పుష్ప హిట్ తర్వాత రష్మిక స్టార్ డం అమాంతం పెరిగిపోయింది.  పుష్ప 2 లో కూడా తనే హీరోయిన్గా చేస్తుంది. ఇక విజయ్ దేవరకొండ కూడా రష్మిక హ్యాండ్ ఇచ్చిందని పుకార్లు వస్తున్నాయి. రష్మిక కొత్త లవర్ ని పట్టిందంటూ మీడియా లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వీళ్లిద్దరూ కలిసి ముంబైలో పలు ఈవెంట్లలో కనిపిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ రష్మిక ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పుకార్లపై పూర్తి స్పష్టత రావాలంటే మనం కొన్ని రోజులు ఆగాల్సిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది