Ravanasura Review: క్రైమ్ థ్రిల్లర్ తో వచ్చిన మాస్ మహారాజ్

 Ravanasura Review: చిత్రం: రావణాసుర; నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు; కథ, సంభాష‌ణ‌లు: శ్రీకాంత్ విస్సా; సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో; సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్; ఎడిటింగ్‌: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైనింగ్‌: డి.ఆర్. కె. కిరణ్; నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ; స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ; బ్యానర్‌: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్ విడుదల మార్చ్ 7. 2023.

Ravanasura Review

సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ, హీరోగా సుశాంత్, అను ఇమ్మానుయేల్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్యా, జయప్రకాష్, నటీనటులు హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సేసిరిలో సంగీతంలో అభిషేక్ పిక్చర్స్ ఆర్టి టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం రావణాసుర మార్చి ఏడవ తారీకు విడుదలయ్యింది.

హిట్టు మీద హిట్తో జోరులో ఉన్న కథానాయకుడు మాస్ మహారాజ్ రవితేజ ధమాకా వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ చేసిన మరో చిత్రం రావణాసుర ఐదుగురు కథానాయకులు ఈ చిత్రంలో ఉన్నారు. నెగిటివ్ టైటిల్ తో ఆసక్తిని పెంచిన రవితేజ ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో మరింత అంచనాను పెంచాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది రవితేజ తన విజయ పరంపరని ఈ చిత్రంతో కొనసాగిస్తారా లేదా చూద్దాం.


కథ: 

రవీంద్ర అలియాస్ రవి (రవి తేజ) జూనియర్ లాయర్ గా పనిచేస్తూ ఉంటాడు. క్రిమినల్ లాయర్ గా పేరు తెచ్చుకున్న కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర పనిచేస్తుంటాడు. హారిక (మేఘ ఆకాష్) తన తండ్రిపై పడిన ఓ హత్య కేసును వాదించాలని అడగటానికి కనకమహాలక్ష్మి దగ్గరికి వస్తుంది. దీనికి కనకమహాలక్ష్మి ఒప్పుకోను అని చెబుతుంది. కానీ రవి చూడగానే ఆమె అందానికి ఫిదా అవుతాడు. ఎలాగైనా కనకమహాలక్ష్మి ఒప్పిస్తానని హారికకు మాట ఇచ్చి రంగంలోకి దిగుతాడు. ఈ కేసు ఒప్పుకున్నాక ఏం జరిగింది ఎవరు గెలిచారు ఇంతకీ హత్య చేసింది ఎవరు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ప్లస్ పాయింట్స్

రవితేజ తన నటనతో ఆకట్టుకుంటాడు రవితేజ పాత్రలో రెండు కోణాలు కనిపిస్తాయి హీరోగా ఇలాంటి పాత్రతో కొత్త ప్రయత్నం చేశారు అనుకోవచ్చు ఈ చిత్రంలో ఏదన్నా కొత్తదనం ఉంది అంటే అది రవితేజ క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ రాసుకున్న రోల్ కి సినిమా టైటిల్ కి తగ్గట్టుగా ఒక పూర్తి కొత్త రవితేజని ఈ రావణాసురం లో మనం చూడొచ్చు ఈ చిత్రంలో రవితేజ మంచి డాన్స్ చెప్పులతో అలరిస్తాడు ఐదుగురు హీరోయిన్లు ఉన్న దర్శకుడు బాగా హ్యాండిల్ చేసి అందరికీ సమాన ప్రాధాన్యతను సీన్స్ లో చూపించాడు ఫరియా మేఘాకాష్ దక్షిణాకర్ అను ఇమ్మానియే అందరూ మంచి రోల్స్ వారి పరిధిలో మంచి ఎమోషన్స్ తో కూడిన సీన్స్ లో కనిపిస్తారు ఇక సుశాంత్ కూడా మంచి పాత్రలో ఆకట్టుకుంటాడు. ఇక హర్షవర్థన్ రామేశ్వర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఫర్వాలేదనిపిస్తుంది. హర్షవర్థన్ రామేశ్వర్‌తో పాటు భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు పాటలు అందించారు. ఈ పాటలు సినిమా విడుదలకు ముందు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాలోనూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. కాకపోతే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో భాగంగా వచ్చే రావణాసుర థీమ్ బాగుంది. యాక్షన్ బ్లాక్ డిజైన్ ఇంటర్వెల్ బ్యాగులు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి ఈ చిత్రంలోని ప్రతి ప్రేమ్ వర్క్ చాలా రిచ్ గా కనిపిస్తాయి ఇక టెక్నికల్ టీం మ్యూజిక్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ బీన్స్ ల పనితనం బాగుంది చిత్రంలోని సినిమాటోగ్రఫీ తన విజువల్స్ ఇంట్రెస్ట్ గా ఉన్నాయి నవీన్ నులి ఎడిటింగ్ ఓకే అని చెప్పొచ్చు.

మైనస్ పాయింట్స్

ఈ చిత్రం ఫస్ట్ ఆఫ్ వరకు అంతా మంచిగా సాఫీగానే ఆసక్తిగానే సాగుతుంది కానీ ఒక సినిమాకి ఎంతో కీలకమైన సెకండాఫ్ లో మాత్రం ఫస్ట్ ఆఫ్ లో ఉన్న ఫ్లో మరియు ఫ్రెష్నెస్ అనేది కొనసాగదు కొన్ని సన్నివేశాలు లాజిక్ మిస్ అవ్వడం కొన్ని సీన్స్ కాస్త ఓవర్ గా కూడా అనిపిస్తాయి సెకండాఫ్ లో స్క్రీన్ రిప్లై ఇంకా బెటర్ గా ఉండాల్సి ఉంది రవితేజ నుంచి కొన్ని కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి కాస్త నిరాశ పరుచుతుంది క్లైమాక్స్ ఈ సినిమాకు మైనస్

ఓవరాల్

రావణాసుర చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ క్యారెక్టరైజేషన్ బాగుంటుంది అలాగే సినిమాలోని త్రిల్లింగ్ ఫ్యాక్టర్ కూడా బాగుంటుంది సుధీర్ వర్మ సినిమా కథ విషయంలో కాస్త కొత్తగా ఏమన్నా ట్రై చేయాల్సింది సెకండాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంటుంది రోటీన్ స్క్రీన్ ప్లే ఇదివరకే చూసిన డ్రామాలు అనిపిస్తుంది సంబంధం లేకుండా ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూసేవారికి ఈ చిత్రం పర్వాలేదనిపిస్తుంది ఒకసారి ఈ చిత్రాన్ని చూడవచ్చు

రేటింగ్ 2.75/5

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది