Pushpa 2: వైరల్ అవుతున్న పుష్ప 2 వీడియో

 


Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పుష్ప దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. పుష్ప తో అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా హీరోగా అవతరించాడు. దీనితో సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 (ది రూల్) చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ హాంట్ ఫర్ పుష్ప పేరుతో ఒక కాన్సెప్ట్ వీడియోని విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప కోసం పోలీసుల వేట అడవిలో బుల్లెట్ గాయాలతో పుష్ప దుస్తులు కనిపించడం పుష్పకు మద్దతుగా ప్రజలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడం వంటి సంఘటనలతో కాన్సెప్ట్ వీడియో అద్భుతంగా ఉంది. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం అదే పులి రెండు అడుగులు వెనక్కు వేసింది అంటే పుష్ప వచ్చిండాడు అంటూ పుష్ప పలికే డైలాగ్ హైలైట్ గా నిలుస్తుంది. పుష్ప క్షేత్రంలో ఎర్రచందనం స్మగ్లర్ సిండికేట్ నాయకుడిగా ఎదిగిన పుష్ప. పుష్ప 2 లో ప్రజల్ని ఆదుకునే పాత్రలో అల్లు అర్జున్ కనిపించడం ఆసక్తి పెంచుతుంది రష్మిక మదన్న పహాద్ ఫాజిల్ ధనుంజయ రావు రమేష్ సునీల్ అనసూయ ఈ చిత్రంలో నటిస్తున్నారు.

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులను బద్దలు కొడుతుంది. హిందీ వీడియో కి ఇప్పటికే 22 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి తెలుగు వీడియో కి 19 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మెరిస్లో క్యూబా బ్రోకేజ్, సంగీతం దేవి శ్రీ ప్రసాద్, పాటలు చంద్రబోస్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం సుకుమార్.

ప్రముఖ సెలేబ్రిటిస్ బన్నీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది