Made In Heaven Season 2: స్వర్గంలో జరిగే పెళ్లికి వధువులుగా మారిన మృనాల్ ఠాకూర్ రాధిక ఆప్టే

 Made In Heaven Season 2 : ప్రముఖ ఓటిపి సంస్థ అయినా అమెజాన్ ప్రైమ్ నుంచి వచ్చిన మేడిన్ హెవెన్ అనే వెబ్ సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే 2019లో వచ్చిన ఈ సిరీస్ ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ బాలీవుడ్ రైటర్ నిర్మాత జోయా అత్తర్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. పెళ్లిళ్లు స్వర్గంలోనే అవుతాయి అన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్ ని రూపొందించారు. వెడ్డింగ్ ప్లానర్స్ గా మారిన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ జీవితాల చుట్టూ తిరిగే కథనే ఈ మేడిన్ హెవెన్.

అయితే మేకర్స్ మేడిన్ హెవెన్ సీజన్ 2 కు సంబంధించిన సూపర్ అప్డేట్ ఇచ్చారు ఆగస్టు పది నుంచి అమెజాన్ ప్రైమ్ లో సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతుందని తెలియజేశారు. చిత్ర యూనిట్ సభ్యులు మేడిన్ హెవెన్ సిరీస్ టు కు సంబంధించిన వధువు పాత్రలను మేడిన్ హెవెన్ లో వధువులుగా సీతారామన్ బ్యూటీ రొనాల్ ఠాకూర్ రాధిక ఆప్టే శివాని దండేకర్ పంజా మూవీ ఫేమ్ సారా జెన్ డయాస్ ముఖ్య పాత్రలుగా నటిస్తున్నారని తెలిపారు.

ఈ వెబ్ సిరీస్ లో బంధువుల పాత్రలు ఫేమస్ అన్న విషయం మనకు తెలిసింది మొదటి సీజన్లో మీర్జాపూర్ పార్టీ మాన్వి గా గ్రూప్, అమృత పూరీలు వధువులుగా నటించగా వీరి నటనకు మంచి స్పందన లభించింది పాత్రలో ఏ విధంగా నటిస్తారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వీరితోపాటు తెలుగు నటి శోభిత ధూళిపాళ్ల ఇంకా మరికొందరు నటిస్తున్నారు ఆగస్టు పది నుండి అమెజాన్ ప్రైమ్ లో మేడిన్ హెవెన్ సీజన్ 2 స్ట్రీమింగ్ అవ్వనుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది